18-05-2025 12:10:58 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్
హీరోలుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లు నటిస్తున్నారు. ఈ సినిమా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో సమావేశమై సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
-ఇది ‘గరుడన్’కు రీమేక్‌గా చేసిన సినిమా. దీన్ని తెలుగులోకి తీసుకురావడానికి కారణం.. -కథ కమర్షియల్‌గా నాకు చాలా నచ్చడమే. అంతేకాకుండా ముగ్గురు హీరోలతో పనిచేసే అవకాశం కూడా వస్తుందని కచ్చితంగా చేయాలని భావించా. అయితే ఒరిజినల్ కథకు కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది.
అయితే అసలు కథలోని సహజత్వం, భావోద్వేగాలు చెడిపోకుండా జాగ్రత్తపడ్డాను. క్యారెక్టరైజేషన్ ప్రజెంటేషన్ నా స్టుల్‌లో ఉంటుంది. తెలుగు సినిమాకు కావాల్సిన కమర్షియల్ విలువలన్నీ ఉంటాయి. ఒరిజినల్‌లో ఉన్న కాన్‌ఫ్లిక్ట్ ఎమోషన్స్‌తోపాటు తెలుగు ఆడియన్స్‌కు కావలసిన ఎమోషన్స్ ఉంటాయి. ఒరిజినల్ కంటే ఇది బావుందనే ఫీలింగ్ కలిగిస్తుంది.
-‘భైరవం’.. -కథ నుంచి వచ్చిన టైటిల్. సినిమాలో చిన్న డివోషనల్ టచింగ్ ఉంటుంది. ఒక గ్రామంలోని గుడికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆ భైరవుడి రూపం నుంచే ఈ టైటిల్ పెట్టాం. -ముందుగా మేము మైసూర్‌లో రియల్ లొకేషన్‌లో సూట్ చేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తర్వాత మా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయడం వల్ల అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసి సూట్ చేశాం.
-ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు సాయిని మొదటి హీరోగా ఫైనల్ చేసుకున్నాం. తర్వాత రోహిత్‌ను, మనోజ్‌ను కలిశాం. మనోజ్, రోహిత్‌లకు కొంత గ్యాప్ వచ్చింది. మంచి నటుల నుంచి మంచి సినిమా వచ్చినప్పుడు కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారన్న నమ్మకం ఉంది.
-నా గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఇంకొంచెం జాయ్ ఫుల్‌గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మధ్య జరుగుతున్న డ్రామా. ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత కావాలో అంతే పెట్టాం.
-మొదట్లో ముగ్గురు హీరోలను సెట్స్‌లో హ్యాండిల్ చేయడం కష్టమవుతుందేమో అనుకున్నా. అయితే ఈ ముగ్గురూ ఆఫ్‌స్క్రీన్ చాలా మంచి ఫ్రెండ్స్. చాలా సపోర్ట్ చేశారు. 14 రోజులపాటు ఫుల్ నైట్స్ వర్క్ చేశాం. సెట్స్‌లో దాదాపు 900 మంది ఉండేవారు. ఆ భాగాన్ని చిత్రీకరించడం సవాలుగా అనిపించింది.
-డ్రామా, యాక్షన్ థ్రిల్లర్స్ హారర్.. ఇవన్నీ ఈజీగా చేయొచ్చు కానీ కామెడీ మాత్రం చాలా కష్టం. అది నాకు చాలెంజింగ్‌గా అనిపిస్తుంది. ‘భైరవం’ ఇచ్చే సక్సెస్ బట్టే నా తర్వాతి సినిమాలు ఉంటాయి. ఇప్పటికైతే -కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. -చిరంజీవి కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నా. ఈ సినిమా గ్యాప్‌లో ఒకసారి చిరంజీవిని కలిశాను కూడా. ఆయన టైమ్ ఇస్తానని చెప్పారు. బాలకృష్ణ, వెంకటేశ్ కోసం కూడా ఒక కథను సిద్ధం చేశాం.