18-05-2025 12:07:39 AM
పుణ్యసాన్నం ఆచరించిన విజయక్రాంతి దినపత్రిక ఎండీ విజయరాజం
మంథని, మే17 (విజయక్రాంతి): కాళేశ్వరం వద్ద నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలకు శనివా రం విజయక్రాంతి దినపత్రిక ఎండీ విజయ రాజం హాజరయ్యారు. ముందుగా త్రివేణి సంగమంలోని సరస్వతీ నదిలో పుష్కర స్నానం ఆచరించి, నదీమ్మ తల్లికి చీర సారే సమర్పించారు. అనంతరం కాళేశ్వరం ఆలయంలో ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేశారు.
ఆలయ వేద పండితులు ఆమెకు స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుష్కర స్నానం ఎంతో పుణ్యఫలమని పేర్కొన్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలలో నది స్నానం ఆచరించడం అదృష్టంగా భావించాలని సూచించారు.
కాగా మహాకుంభమేళా స్ఫూర్తిగా ఈ పుష్కరాల సందర్భంగా దేశవ్యాప్తంగా కాళేశ్వరానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి వద్ద టెంట్ సిటీ ఏర్పాటు చేయడం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో కాళేశ్వరం మరింత పర్యాటక ప్రాంతంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని భక్తులకు విశ్వాసం కలిగించారని ఆమె పేర్కొన్నారు.