calender_icon.png 18 May, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన పోలీసులు ఆదర్శం

18-05-2025 01:00:15 AM

  1. డ్రగ్స్ కట్టడిలో ప్రపంచంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం సంతోషం
  2. అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్‌లో అవార్డు అందుకున్న సీపీకి సీఎం అభినందనలు

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): ప్రపంచానికే తెలంగాణను రోల్‌మోడల్‌గా తయారు చేయాలన్నది తన లక్ష్యమని, అందుకు అనుగుణంగా మాదకద్రవ్యాల కట్టడిలో తెలంగాణ పోలీసులు చక్కని పనితీరు కనబరిచి ప్రపంచంలోనే అగ్రస్థానం లో నిలబడి ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

దుబాయ్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ పోలీస్ సమ్మిట్‌లో హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ సీవీ ఆనంద్, ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకోవడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీపడి తెలంగాణ పోలీస్ ప్రపంచంలో మొదటి స్థానం సాధించడం గర్వంగా ఉందని శనివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ ఆనంద్‌కు, ఆయన బృందానికి తన ప్రత్యేక అభినందనలు అని పేర్కొన్నా రు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం తానుకంటున్న కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్న ప్రతి పోలీస్‌కు మద్దతుగా ఉంటానని సీఎం స్పష్టం చేశారు.

ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకు న్న సందర్భంగా శనివారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్‌లో తెలంగాణ నుంచి అవార్డు అందుకున్నట్టు సీఎంకు వివరించారు. 138 దేశాలతో పోటీపడి తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం పట్ల రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.