calender_icon.png 18 May, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యమదొంగ రీరిలీజ్!

18-05-2025 12:15:06 AM

ఎన్టీఆర్, మోహన్‌బాబు, ప్రియమణి, మమత మోహన్‌దాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఐకానిక్ సోషియో ఫాంటసీ ‘యమదొంగ’ అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతోన్నారు. తారక్ బర్త్‌డే మే 20వ తేదీన ఉండటంతో అంతకు ముందు నుంచే థియేటర్లలో ‘యమదొంగ’ సందడి చేయనున్నాడు.

మే 18న ఆదివారం (నేడు) ఈ చిత్రం రీ రిలీజ్ కానుంది. రీ రిలీజ్‌తో రాజమౌళి విజన్, కీరవాణి సంగీతాన్ని మరోసారి తెరపై ప్రేక్షకులు వీక్షించనున్నారు. అయితే రీ రిలీజ్ కోసం టీమ్ చాలానే కష్టపడింది. యమదొంగ 8కేలో స్కాన్ చేసి 4కేకు కుదించి మునుపెన్నడూ లేనివిధంగా అద్భుతమైన దృశ్య అనుభవాన్ని కలిగించేలా సిద్ధం చేశారు. దీంతో ఈ సినిమాను మరింత నాణ్యతతో వీక్షించే అవకాశం అభిమానులకు కలుగనుంది. 

బర్త్‌డేకు అప్‌డేట్ లేదట.. 

ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను దక్కించుకున్న టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్. ‘కేజీఎఫ్’ సిరీస్, ‘సలార్’ వంటి సంచలనాత్మక బ్లాక్‌బస్టర్లను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఎన్టీఆర్ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

అయితే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తారని అభిమానులు ఆశించారు. కానీ ఆ రోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉండదట! ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలే క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ నటించిన ‘వార్2’ నుంచి అప్డేట్ వస్తున్నందన తాము ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఇప్పటికైతే అప్టేట్‌ను వాయిదా వేస్తున్నామని, మళ్లీ సరైన సమయం చూసి అప్‌డేట్ ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్టీఆర్, నీల్ కాంబో మూవీ 2026, జూన్ 25న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం తదితర భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై కల్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు.