calender_icon.png 27 September, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

27-09-2025 06:29:42 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): కలెక్టరేట్ లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించారని, స్వాతంత్రోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. రాజకీయ రంగంలో వివిధ పదవులలో ప్రజా శ్రేయస్సుకు ఎనలేని సేవలు అందించారని, తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలలో తన వంతు పాత్ర పోషించారని తెలిపారు.