calender_icon.png 27 September, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గ‌ద్దీ చోడ్ పై సంత‌కాల సేకరణ

27-09-2025 06:26:27 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓట్ చోర్ గ‌ద్దీ చోడ్ ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌న్న ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల‌తో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంచార్జి కంది శ్రీ‌న‌వాస రెడ్డి నేతృత్వంలో క్యాంపెయిన్ నిర్వ‌హించారు. శ‌నివారం జైన‌థ్ మండ‌లం బెల్గాం గ్రామంలో బీజేపీ ఓట్ల చోరీపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్ర‌జ‌ల‌కు ప‌త్రాలు పంచుతూ సంత‌కాలు తీసుకొని ఓట్ల‌చోరీ పై సిగ్నేచ‌ర్ క్యాంపెయిన్ చేప‌ట్టారు. నియోజ‌క వ‌ర్గంలో ప్ర‌స్తుత నూత‌న ఓట‌ర్ లిస్ట్ లో ఏవైనా దొంగ ఓట్లు న‌మోదైతే పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకురావాల‌ని శ్రేణుల‌కు సూచించారు.