27-09-2025 07:13:13 PM
హైదరాబాద్: గత ప్రభుత్వం పదేళ్లుగా గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వలేదని.. కేసీఆర్ ప్రభుత్వం తన కుటుంబం గురించే ఆలోచించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన గ్రూప్-1 అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని అన్నారు. టీజీపీఎస్సీకి నిధుల అంశంలో రాజీపడొద్దని సీఎం ఎన్నోసార్లు నాకు చెప్పారని.. కూలీలు, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు కూడా గ్రూప్-1 సాధించారని తెలిపారు. రాష్ట్రంలోని వనరులన్నింటినీ సమానంగా పంచాలనేదే మా సంకల్పమని, గ్రూప్-1 విజేతలు కొత్త జీవితం ప్రారంభించబోతున్నారని అన్నారు. రాబోయే 30-35 ఏళ్లు రాష్ట్ర ప్రగతిలో మీరు కీలకపాత్ర పోషించబోతున్నారని.. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు.