27-09-2025 06:59:41 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రుల ఉత్సవంలో భాగంగా శని వారం పాత మంచిర్యాల రామలింగేశ్వర ఆలయంలో మహా చండీయాగం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు బుడి అరుణ్ శర్మ ఆధ్వర్యంలో 40 మంది వేద బ్రాహ్మణులు 27 హోమగుండాలలో యాగాన్ని 108 జంటలతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రామాలయం శివాలయం ఆలయ కమిటీ యాగ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భవానీలు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజ అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు.