calender_icon.png 27 September, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108 అంబులెన్స్ లో మహిళా ప్రసవం.. కృతజ్ఞతలు తెలిపిన మహిళా కుటుంబం

27-09-2025 06:30:06 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): పెద్ద కొడప్గల్ 108 సిబ్బందికి సమాచారం అందిన వెంటనే వెళ్లి చిన్న ఎక్లారాకు చెందిన నందినికి పెద్ద కొడప్గల్ అంబులెన్స్ సిబ్బంది పురుడు పోశారు. నిండు గర్భిణీ అయినా నందినికి మొదటి కాన్పు నిమిత్తం శనివారం ఉదయం పురిటి నొప్పులతో బాధపడుతుందని ప్రసవానికి తీసుకెళ్ళేందుకు గాను నందిని కుటుంబీకులు 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే పెద్ద కొడప్గల్ మండలానికి చెందిన అంబులెన్స్ సిబ్బంది సి హెచ్ సి బిచ్కుందకు చేరుకొని నందినికి ఎం సి హెచ్, బాన్సువాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో బిచ్కుంద కమ్మరి గుడి దగ్గరకు రాగానే పురిటి నొప్పులు అధికం కావడంతో 108 అంబులెన్స్ లోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. పెద్ద కొడప్గల్ అంబులెన్స్ సిబ్బంది ఈ ఏం టి, గంగారాం, పైలట్, బసంత్  లు ఉన్నారు. వీరికి సమాచారం అందివ్వగానే తక్షణమే స్పందించి వచ్చినందుకు కృతజ్ఞలు తెలుపుతూ నందిని కుటుంబీకులు అభినందించారు.