calender_icon.png 22 July, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అచ్యుతానందన్ సేవలు చిరస్మరణీయం

22-07-2025 12:04:12 AM

- నివాళులర్పించిన సీపీఎం నాయకులు 

ఎల్బీనగర్, జులై 21 : కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ మృతికి సీపీఎం నాయకులు నివాళులర్పించారు. సీపీఎం హయత్ నగర్  శాఖ కార్యదర్శి కొత్త గణేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. అచ్యుతానందన్ కేరళ ముఖ్యమంత్రిగా 2006 నుంచి 2011 వరకు బాధ్యత వహించారని తెలిపారు. కేరళ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడంలో తన చివరి శ్వాస వరకు పనిచేశారని, కేరళలో వామపక్ష ప్రభుత్వం ఏర్పడడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు.

వైద్యరంగంలోనూ విద్యారంగంలోనూ మిగిలిన అన్ని రంగాలలోనూ కేరళ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో అచ్యుతానందన్ విశేష కృషి చేశారని తెలిపారు. అచ్యుతానందన్ మృతి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుకు తీరని లోటు అని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు చంద్రమోహన్, సర్కిల్ కార్యదర్శి కీసర నర్సిరెడ్డి  సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సంధ్య, నర్సింహ, సంతోష, వెంకటేష్, లక్ష్మీనారాయణ,  కవిత, సుశీల, రాజు గౌడ్ తదితరులుపాల్గొన్నారు.