22-07-2025 12:07:37 AM
-ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
-ఇటీవల జీనోమ్ వ్యాలీ సందర్శించిన సీఎం
మేడ్చల్, జూలై 21(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా జీనోమ్ వ్యాలీలో అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీనోమ్ వ్యాలీలో కొత్తగా ఏ టి సి ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఫార్మా, బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ తరంగాలకు అనుగుణంగా కోర్సులు ప్రవే శపెట్టాలన్నారు. ఏటీసీలు యువతకు ఉపాధి కల్పించేలా ఉండాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఏటీసీలను త్వరగా పూర్తిచేయాలని, వీటిపై ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ఏటీసీలు ఏ దశలో ఉన్నాయో అధికారులు సీఎంకు వివరించారు.
జీనోమ్ వ్యాలీ కి వచ్చిన వారం రోజుల్లోనే....
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జీనోమ్ వ్యాలీ కి వచ్చారు. వచ్చిన వారం రోజుల్లోనే ఇక్కడ ఏ టి సి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఐకార్ రెండో యూనిట్ శంకుస్థాపనకు వచ్చారు. కాగా జీనోమ్ వ్యాలీ లో ఏటీసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల స్థా నికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షామీర్పేట్ లో ప్రభుత్వ ఐటిఐ ఉంది. కానీ అందులో ఎక్కువ కోర్సులు లేవు. ఏటీసీగా అప్గ్రేడ్ చేయలేదు. నామమాత్రపు కోర్సులు ఉన్నాయి. జీనోము వ్యాలీలో కొత్తగా ఏర్పాటు చేసే ఏటిసి ని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.