22-07-2025 12:03:37 AM
8 ద్విచక్ర వాహనాలు ధ్వంసం
పరుగులు తీసిన ద్విచక్ర వాహనదారులు
బాన్సువాడ, జూలై 21 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం త్రుటీలో తప్పింది. బస్సు డ్రైవర్ నిఖిల్ కు ఫిట్స్ వచ్చి కు గురి కాగా వెంటనే కండక్టర్ బస్సు బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో పూల దుకాణాల వద్ద చోటుచేసుకుంది.
సంగారెడ్డి నుంచి ఆర్టీసీ బస్సు బోధన్ వెళుతుండగా బాన్సువాడ బస్టాండ్ సమీపంలో పూల దుకాణాలు అమ్మే చోటు కు రాగానే బస్సు డ్రైవర్ నిఖిల్ కు పిట్స్ వచ్చి అస్వస్థతకు గురి కావడంతో బస్సు బాన్సువాడ బస్టాండ్ వైపు వెళుతున్న సమయంలో ఒకసారి గా పూలు అమ్మే చోటు వైపు మరలడంతో కండక్టర్ గౌస్ స్పందించి బ్రేక్ వేశారు. దీంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.
అప్పటికే పూల దుకాణాల ఎదుట నిలిపిన ద్విచక్ర వాహనాల ను బస్సు ఢీకొట్టడంతో ఎనిమిది ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. అప్పటికే కండక్టర్ గౌస్ బస్సు బ్రేక్ వేయడంతో ఆగిపోయింది. ప్రయాణికులు ప్రమాదం నుంచి గట్టిక్కడం తో ఊపిరి పీల్చుకున్నారు. సడన్ బ్రేక్ వేయకుంటే పూల దుకాణాల్లోకి చూచుకొని పోయి ప్రయాణికులు తీవ్రంగా గాయపడేవారు.
ఊహించని విధంగా సంఘటన జరగడంతో ప్రయాణికులు ఒకేసారి ఆందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం నుంచి గట్టి ఎక్కించిన కండక్టర్ గౌస్ ను ప్రయాణికులు అభినందించారు. పెను ప్రమాదం నుంచి గట్టెక్కిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు.
ఆర్టీసీ అధికారులు సైతం సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన వివరాలను తెలుసుకున్నారు. డ్రైవర్ నిఖిల్ అస్వస్థతకు గురికాగా సమయస్ఫూర్తిగా వ్యవహరించి పక్కకు తిప్పడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.