calender_icon.png 10 May, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ లైన్ దాటితే ఎవరిపైనైనా చర్యలు సహజం

08-05-2025 01:12:04 AM

రాష్ర్ట హౌజ్‌ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి 

కరీంనగర్, మే 7 (విజయక్రాంతి): ఎంత సీనియర్ లీడర్ అయినా, మాజీ మంత్రి అయినా... పార్టీ లైన్ దాటితే కాంగ్రెస్ పార్టీలో క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం సహజమేనని రాష్ర్ట హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు. నేతల మధ్య సమన్వయ లోపం ఉండకుండా ఏ స్థాయి లీడర్ అయినా కార్యకర్తలందరినీ కలుపుకుని వెళ్లడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అన్నారు.

తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్), వి.హన్మంతరావు, పురమల్ల శ్రీనివాస్ లు మున్నూరు కాపు కులానికి చెందినవారని, తీన్మార్ మల్లన్న, పురమల్ల శ్రీనివాస్ లను పార్టీ సస్పెండ్ చేయడంతో మున్నూరు కాపుకు చెందిన కొందరు నాయకులు సోషల్ మీడియాలో ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేసారు. టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, రవాణా, బీ.సీ. సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గౌడ్ లు ఉండటంతో వీరు ఇద్దరూ గౌడ కులానికి చెందడంతో గౌడ కులస్తులు మున్నూరు కాపు కులానికి చెందిన నేతలనే టార్గెట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆసత్య ప్రచారాలు చేయడం తగదని హెచ్చరించారు.

మంత్రి పొన్నం సీనియర్ నాయకుడని బహిరంగంగా అప్రతిష్ట పాలు చేస్తే పార్టీ అధిష్టానం చూస్తు ఉరుకుంటుందా అంటూ ప్రశ్నించారు. పురుమల్ల శ్రీనివాస్ పార్టీ లైన్ పలుమార్లు దాటితే హెచ్చరించిన తన తీరు మార్చుకోకపోవడం వల్లనే పార్టీ సస్పెండ్ చేసిందన్నారు. వేములవాడ ఎమ్మెల్యే టిక్కెట్ ఆది శ్రీనివాస్ కు ఇవ్వడంతో గెలుపొందిన తనకి ప్రభుత్వ విప్ ఇచ్చిందన్నారు.

మంత్రి పదవి రాకుండా ఏవరూ కూడా అడ్డుకోవడం లేదని కేవలం కుల రాజకీయాలు చేయడానికే అసత్య ఆరోపణ చేస్తున్నారని అవి మానుకోవాలని హితవు పలికారు. వి.హన్మంతరావు, డి.శ్రీనివాస్, కె.కేశవరావు లను కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులను చేసి గౌరవించిందన్నారు. తప్పులు చేసింది వారైతే టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ల పై ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ నీచ రాజకీయాలు మానుకోవాలని శ్రీరామ్ చక్రవర్తి హితవు పలికారు.