calender_icon.png 9 May, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి

08-05-2025 01:10:32 AM

వైద్యబృందానికి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందనలు 

పెద్దపల్లి, మే 7 (విజయక్రాంతి) ః క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా  జిల్లా  ఆసుపత్రిలో నిర్వహించినందుకు వైద్య బృందాన్ని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సుల్తానాబాద్ కు చెందిన నిట్టూరి మానస అనే మహిళకు గతంలో రెండు సీజేరియన్ ఆపరేషన్ లు జరిగాయని,  గర్భ సంచి లో పెద్ద గడ్డలతో మహిళ తీవ్రమైనా కడుపు నొప్పితో బాధపడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిందని,  మహిళకు అవసరమైన పరీక్షలు చేసి, మే 7న గైనకాలాజిస్ట్  డా.స్రవంతి, జనరల్ సర్జన్ డా. సాయి ప్రసాద్, లాప్రోస్కోప్ సర్జన్ డా.అమర సింహ రెడ్డి, సూపరింటెండెంట్ డా.కె.శ్రీధర్, డా.రామం, డా.స్వాతి, డా.సౌరయ్య కలిసి ఆ మహిళకు లాప్రోస్కోప్ హిస్టక్టమ్ సర్జరీ  విజయవంతంగా చేశారని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ రకాల సేవలు, శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని, అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రకటనలో కోరారు.