calender_icon.png 27 August, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాతో ఫుట్‌బాల్ ఆడుతున్నారు!

27-08-2025 01:52:35 AM

  1. పార్టీ సంస్థాగత కార్యదర్శికి ఫుట్‌బాల్ గిఫ్ట్ 
  2. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వినూత్న నిరసన

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ‘బీజేపీలో తనతో పార్టీ నేతలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు’ అని పేర్కొం టూ ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపా రు. మంగళవారం ఆయన హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా అందించి... తనను పార్టీ లో ఫుట్‌బాల్ ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ నిర్మాణం సక్రమంగా లేదని చెప్పినా స్పందించని నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా వ్యవహరించినట్లు పార్టీ శ్రేణు లు వెల్లడించాయి.

తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్టీ వ్యవహారాలపై మాట్లాడేందుకు మొదట సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిస్తే... స్టేట్ చీఫ్ రాంచందర్ రావును కలువమని చెప్పడం, ఆయనను కలిస్తే పార్టీ ఇన్‌చార్జి అభయ్ పాటిల్‌ను కలిసి పరిస్థితిని వివరించాలని సూచించారని... తీరా పాటిల్‌ను కలిస్తే ఆయన మరో నేత పేరు చెప్పారని తెలుస్తోంది. ఒకరిని కలిస్తే మరొకరి పేరు చెబుతున్నారని  మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఎంపీ ఈ విధంగా తివారీకి ఫుట్‌బాల్ పంపించి తన నిరసనను తెలిపినట్లుగా సమాచారం. జిల్లా  అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయ లోపంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.  

 ఫుట్‌బాల్ నిరసన ఏదీ లేదు

 ఈ వివాదంపై విజయక్రాంతి ఆయనతో మాట్లాడగా... ఫుట్‌బాల్ నిరసన ఏదీ లేదన్నారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓట్ చోరీ అంశంపై తాను మీడియాతో మాట్లాడతానని ఆయన తెలిపారు. అయితే పార్టీలో పరిస్థితి చూస్తుంటే అంతా సక్రమంగా ఉన్నట్లుగా కనపడటం లేదని పార్టీ నేతలు కొందరు తెలిపారు. ఇటీవల రాజాసింగ్-కిషన్‌రెడ్డి, ఈటల- బండి సంజయ్, డీకే అరుణ-శాంతికుమార్ వివా దం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కొండా అసంతృప్తి పార్టీ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీసేలా కనిపిస్తోంది.