11-10-2025 01:09:54 AM
జమీయత్ ఉలమా జిల్లా అధ్యక్షుడు అహ్మద్ ముబిన్
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 10(విజయక్రాంతి) : మధ్యప్రదేశ్ లోని ఇందోర్‌లో ఎమ్మెల్యే రాజా సింగ్ మొహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని జమీయత్ ఉలమా జిల్లా అధ్యక్షుడు అహ్మద్ మో బిన్ అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్‌కు వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా పీర్ షబ్బీర్ ఆదేశాలు మేరకు వినతి పత్రం ఇవ్వ డం జరిగిందన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ దేశ ప్రజలను రెచ్చగొట్టేందుకు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వెంటనే అతనిని ఎమ్మెల్యే బాధ్యతల నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందో ళనాలు చేపడతామని హెచ్చరించారు.
జమీయత్ ఉలమా జిల్లా సంయుక్త కార్యదర్శులు అలీమ్ హుస్సేనీ , అహ్మద్ అమీన్ , ఆసిఫాబాద్ టౌన్ అధ్యక్షడు అబ్దుల్ హకీమ్, కాగజ్నగర్ టౌన్ అధ్యక్షుడు తాలేబ్ బీన్ ఈసా, ఆసిఫాబాద్ టౌన్ కార్యదర్శి తాహెర్ హష్మీ పాల్గొన్నారు.