11-10-2025 01:08:55 AM
ఉప్పల్,(విజయక్రాంతి): కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లితో గొడవపడి కొట్టిన వీడియో వైరల్ కావడంతో మనస్థాపన గురై బిజెపి నేత బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే ఉప్పల్ బిజెపి నాయకులు రేవల్లి రాజు గత కొంతకాలంగా బిజెపి పార్టీలో నాయకునిగా చురుకుగా కార్యక్రమాలు చేసేవారు. ఇటీవల కాలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో తన తల్లిపై చేయి చేసుకున్నాడు. ఇట్టి విషయాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడంతో మనస్థాపన చెంది సెల్ఫీ వీడియోను తీసుకొని మరి బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
బీబీనగర్ చెరువులో గుర్తుతెలియని మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు దీంతో చనిపోయిన వ్యక్తి రాజుగా బీబీనగర్ పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలను రాజకీయంగా సోషల్ మీడియా నివేదికగా చేసి పరువు పరువు తీశారు అంటూ వీడియోలు సైతం రాజు పెట్టడంతో బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద ఆందోళన దిగారు. రాజు మృతి కారణమైన సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు