calender_icon.png 15 September, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి స్థలం కోసం వేధిస్తున్న శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలి

15-09-2025 01:16:25 AM

ప్రభుత్వానికి బాధిత వృద్ధురాలు అమృతమ్మ విజ్ఞప్తి

ముషీరాబాద్, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): ఇంటి స్థలం కోసం తమ కుటుం బాన్ని మానసికంగా హింసిస్తూ, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విముక్త చిరుతల కచ్చి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, డా.జిలుకర శ్రీనివాస్, అతని అనుచరుల నుండి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని జనగాం జిల్లా, రఘునాథపల్లి మండలంకు గ్రామానికి చెందిన బాధిత వృద్ధురాలు ఎల్మకంటి అమృతమ్మ వేడుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు రక్షణ కల్పించి, స్థలం విషయంలో న్యాయం చేయాలి వృద్ధురాలు విజ్ఞప్తి చేసింది.

ఈ విషయంపై స్థానిక రఘునాథ్ పల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె కన్నీటి పర్యాంతమయ్యింది. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూతురు జిలుకర రేణుక, మనువడు రంజిత్, అల్లుడు కృష్ణాకర్ తో కలిసి ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రామంలో తమకు 40 ఏళ్ల క్రితం తన భర్త వెంకటయ్య పేరుపై ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 200 గజాల స్థలం వచ్చిందని, అందులో తాము రెండు రూంలు వేసుకొని నివాసం ఉంటున్నామని తెలిపారు.

అయితే తన చెల్లెలు సుగుణ అల్లు డు జిలుకర శ్రీనివాస్, ఎల్మకంటి అనిల్ కుమార్, జిలుకర స్వామి, సోమనాధం జిలుకర నర్సయ్యలు తమకున్న 200 గజాల స్థలం నుండి మాకు 100 గజాలు ఇవ్వాలంటూ వృద్ధురాలు అని కూడా చూడ కుండా జులై 27న రాత్రి బూతులు తిడుతూ ఇంట్లో నుండి వెళ్ళాలంటూ దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఇంటి స్థలం ఇవ్వకపోతే ఎప్పటికైనా మీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. గత 40ఏళ్ళుగా తాము ఇంటి పన్ను, నల్లపన్ను, విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నామని తెలిపారు.