calender_icon.png 15 September, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేధా స్కూల్ సీజ్

15-09-2025 01:16:33 AM

  1. బడిని డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చడంపై సర్కార్ సీరియస్
  2. అన్ని రకాల అనుమతులు రద్దు 
  3. విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు చర్యలు

హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయినపల్లి మేధా స్కూల్ అధినేత మల్లెల జయప్రకాశ్‌గౌడ్.. తన స్కూల్‌ను డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చిన ఉదంతంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సర్కార్ ఆదేశాల మేరకు ఆదివారం రాష్ట్రప్రభుత్వం ఆ స్కూల్‌ను సీజ్ చేసింది. బాలనగ ర్ ఎంఈవో హరిశ్చంద్ర పాఠశాల అనుమతులను రద్దు చేశారు.

స్కూల్‌లో  మొత్తం 130 మంది  విద్యార్థులు చదువుతున్నారని గుర్తించారు. వారిని ఇతర స్కూళ్లలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలలను సందర్శించనున్నారు. అనంతరం స్కూల్‌ను శాశ్వతంగా మూసివేయను న్నారు. మరోవైపు ఈగల్ టీం ఈ కేసు ద ర్యాప్తును వేగవంతం చేసింది. ప్రధాన సూత్రధారి మల్లేల జయప్రకాశ్ అడ్డదారుల్లో డ బ్బు సంపాదించాలనే దురాశతో దందాలోకి దిగాడని గుర్తించింది.

అతడికి గురువా రెడ్డి అనే వ్యక్తి ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ము లా ఇచ్చాడని నిర్ధారించింది. జయప్రకాశ్‌కు సహకరిస్తున్న పెంటమోల్ ఉదయ్‌సాయి, గౌటె మురళిని అదుపులోకి తీసుకున్నది. ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. వారికి ముడి పదార్థాలను ఎవరు సప్లు చేస్తున్నారు.. తయారు చేసిన మత్తు పదార్థాలను ఎవరికి విక్రయిస్తున్నారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నది.