calender_icon.png 15 September, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి

15-09-2025 01:14:53 AM

బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్

ముషీరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ అన్నా రు. ఈ మేరకు ఆదివారం ముషీరాబాద్ డివిజన్ లోని పఠాన్ బస్తీలో డివిజన్ బీఆర్‌ఎస్ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ పర్వేజ్ ఆధ్వర్యంలో ప్రోకేర్ సహకారంతో ఉచిత మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన ఎడ్ల హరిబాబు యాదవ్ ప్రారంభించారు.

డాక్టర్లు 200ల మందికి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఎడ్ల హరిబాబు యాదవ్ మాట్లాడుతూ స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ వైద్య సంస్థలు, మానవత దృక్పదంతో పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు వాసీమ్, ముజీబ్, తస్నీమ్, వీర్ ఖాజాపాషా, ముషీరాబాద్ డీఐ ఎండీ నదీమ్, బీఆర్‌ఎస్ నాయకులు సయ్యద్ అక్తర్, ఫైజాన్, ఉస్మాయిల్, హాజీమ్ తదితరులు పాల్గొన్నారు.