calender_icon.png 14 October, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాల భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి..

14-10-2025 06:14:28 PM

బెల్లంపల్లి అర్బన్: కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల కబ్జా కారులపై చర్యలు తీసుకోవాలని రైతు, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కబ్జా భూములను మంగళవారం నాయకుల బృందం సందర్శించింది ఈ సందర్భంగా బృందం ప్రతినిధులు మాట్లాడారు. నెమిల్ల గుట్ట,-60 సర్వే నంబరు, 55 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమి, ఇంద్రమ్మ గృహాలకు కేటాయించాలన్నారు. కన్నాల గ్రామపంచాయతీలో ప్రభుత్వ భూమిని కొంతమంది బడా వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులకు లావని పట్టా చేసి రియల్ ఎస్టేట్ చేసుకొనుటకు అనుమతి ఇచ్చారని అరోపించారు. అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు గైకొనాలి డిమాండ్ చేశారు. గుట్టలకు పట్టాలిచ్చిన అధికారులను తక్షణమే ఉద్యోగాల నుండి తొలగించాన్నారు.

ప్రభుత్వ, అసైన్డ్, భూములు, అనర్హులకు లవాని పట్టాలు, లావని పట్టాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాల పర్మిషన్ లు, గత ప్రభుత్వంలో అసైన్డ్ కమిటీలే లేవనీ, లవని పట్టాలు ఎలా ఇచ్చారనీ ప్రశ్నించారు. ఎర్రకుంట చెరువుపై అధికారులు సమగ్ర విచారణ జరిపి యధావిధిగా ఎర్రకుంట చెరువు పనులను యుద్ధ ప్రాతిపాదికన  ప్రారంభించాలనీ కోరారు. తిరుమల హిల్స్ తోపాటు రెండు పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గ ఎమ్మెల్యే, చొరవ తీసుకుని నేమిళ్ల గుట్ట తొలగింపుకు సహకరించిన నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కన్నాల గ్రామపంచాయతీలో గల సర్వే నంబర్ 60లో 55 ఎకరాల 18 గుంటలు ప్రభుత్వ భూమిని భూమిలేని పేదలకు ఇంద్రమ్మ గృహాలకు కేటాయించాలన్నారు. లేనిపక్షంలో జరగబోయే ఆందోళన కార్యక్రమాలకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి చాంద్ పాషా, నాయకులు అంబాల మహేందర్, గోగర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.