14-10-2025 09:02:47 PM
- మాచారం వద్ద పోలీసుల పటిష్ట తనిఖీలు
- అక్రమ రవాణాపై గట్టి నిఘా
పెన్ పహాడ్ : సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహా ఆదేశాల మేరకు పెన్ పహాడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మాచారం గ్రామం వద్ద సోమవారం 'నాఖబంది' పకడ్బందీగా నిర్వహించిన్నట్లు ఎస్ఐ గోపి కృష్ణ తెలిపారు. ఈ నాఖబందిలో భాగంగా ప్రతి వాహనాన్ని నిబంధనల ప్రకారం సక్రమంగా తనిఖీ చేసినట్లు, అంతేకాక అక్రమ రవాణా కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై కఠిన నిఘా ఉంచామని చెప్పారు. ఈ కార్యక్రమాలతో ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకం ఏర్పడుతుందని, ఎల్లపుడు పోలీస్ వ్యవస్థ ప్రజలకు అండగా నిలుస్తుందని ఎస్ఐ గోపి కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.