calender_icon.png 14 October, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

14-10-2025 06:12:02 PM

జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కళింగ కృష్ణ కుమార్..

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపైన అవగాహన..

పటాన్ చెరు: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల బేగంపేట, హైదరాబాద్ జాతీయ సేవా పథకం చైర్మన్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.పద్మావతి, యూనిట్ 1 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీ.నరసింహులు, యూనిట్ 3 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం.మధుకర్ రావుల ఆధ్వర్యంలో ఆరవ రోజు మంగళవారం ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరము సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఐనోల్, పెద్ద కంజర్ల గ్రామాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మాదక ద్రవ్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీధి వీధినా తిరుగుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ పోస్టర్లను అతికించారు.

జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కళింగ కృష్ణ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థి దశలో జ్ఞాన సమపార్థనకు ఎక్కువ సమయం కేటాయించాలని, క్రమశిక్షణతో పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. విద్యార్థులు సమాజ విలువల పట్ల అంకితభావంతో ఉండాలని సూచించారు. కళింగ కృష్ణ కుమార్ ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చినందుకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో శాస్త్రీయ నృత్యం, జానపద సామాజిక అంశాలపైన నాటకాలను ప్రదర్శించి ప్రజలను చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డి, యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.