calender_icon.png 14 October, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్

14-10-2025 06:22:28 PM

మేడిపల్లి (విజయక్రాంతి): పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 13వ తేదీ సాయంత్రం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రశాంత్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి పేకాట ఆడుతున్న వ్యక్తులు సంతోష్ కుమార్, కే సంతోష్, వీరన్న, గణేష్ లను అదుపులోకి తీసుకొని వారి నుంచి ఐదువేల రూపాయలు నగదు, ప్లేయింగ్ కార్డ్స్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి తెలిపారు.