calender_icon.png 15 October, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి

14-10-2025 08:39:29 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

చిట్యాల (విజయక్రాంతి): వర్షసూచనను దృష్టిలో ఉంచుకొని రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్తగా టార్పాలిన్ లు కప్పి ఉంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అకాల వర్షం వల్ల  వర్షానికి తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని, ఉదయం ధాన్యాన్ని ఆరబెట్టాలని రైతులకు సూచించారు. సరైన తేమ వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యుల సారథ్యంలో ధాన్యం కొనుగోలును ప్రారంభించడం జరుగుతుందని ఆమె తెలిపారు.

రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చినట్లయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందవచ్చని అన్నారు.  ఇందుకుగాను రైతులు ధాన్యం ఎక్కువ తేమ లేకుండా, 17% తేమ మీంచకుండా తాలు, తరుగు వంటివి లేకుండా ధాన్యాన్ని తూర్పారబట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి, డి.ఎస్.ఓ వెంకటేష్, డిప్యూటీ ఎమ్మార్వో  విజయ. మార్కెటింగ్ ఏ డి ఛాయా దేవి ,ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.