14-10-2025 08:46:10 PM
మంథనిలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..
మంథని (విజయక్రాంతి): జిల్లాలో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. మంగళవారం మంథని నియోజకవర్గంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో భాగంగా సంఘటన్ శ్రీజన్ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకులు డా.జయ్ కుమార్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ రావ్ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మూడు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలుపుతానికి కృషి చేయాలని, కార్యకర్తల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా పార్టీ అధ్యక్షులు నియామకం జరుగుతుందని తెలిపారు. కార్యకర్తలు తమ అభిప్రాయాలను అబ్జర్వర్లకు స్వేచ్ఛగా తెలపవచ్చని కార్యకర్తలకు, నాయకులకు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్ష పదవి కోసం సుమారు పదిమందికి పైగా నాయకులు తమ దరఖాస్తులను సమర్పించారు.