calender_icon.png 15 October, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా అధ్యక్షుడి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయమే కీలకమైంది

14-10-2025 08:51:24 PM

మంథనిలో ఏఐసీసీ పరిశీలకులు "డా. కే జయకుమార్..

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయమే కీలకమైందని పార్టీకి ప్రజలకు మధ్య సమన్వయకర్తగా పనిచేయడమే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ప్రధాన అర్హత అని ఏఐసీసీ పరిశీలకులు "డా. కే జయకుమార్ అన్నారు. మంగళవారం మంథని పట్టణంలోని నృరసింహ శివ కిరణ్ గార్డెన్స్ లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణు గోపాల్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ లతో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నిక కోసం కార్యకర్తలు, నాయకుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కిందిస్థాయి కార్యకర్తల నుండి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నామినేట్ పద్ధతిన నియమించకుండా క్షేత్రస్థాయిలో బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు విభాగాల అధ్యక్షులు, ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టి ఎవరిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తే వారు ప్రజలకు అందుబాటులో ఉంటారో, ప్రజా పాలనలో భాగస్వాములై సమన్వయకర్తగా పనిచేయగలుగుతారో, అలాంటి వారిని ఎన్నుకునే ఉద్దేశంతో ఈ నూతన పద్ధతికి శ్రీకారం చుట్టిందన్నారు.

ఈ నియామక ప్రక్రియ ఇప్పటివరకు ఐదు రాష్ట్రాలలో విజయవంతమయిందని, ఆరో రాష్ట్రంగా తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 22 మంది ఏఐసీసీ పరిశీలకులు, పిసిసి పరిశీలకులతో రాష్ట్రవ్యాప్తంగా నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నియామక ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు.  జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కార్యకర్త నుంచి ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజా అభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత ఆ నివేదికను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలకు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో పరిశీలకులు ఈ కేతూరి వెంకటేష్, ఖాజా ఫకృద్దీన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.