calender_icon.png 15 October, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ

14-10-2025 08:55:09 PM

మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి..

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంగళవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బాధిత కుటుంబాలను పరామర్శించి, బాసటగా నిలిచారు. కుటుంబాలకు భరోసా కల్పించారు. మండలంలోని ఒడిపిలవంచ గ్రామానికి చెందిన ఇసునం లక్ష్మి ఇటీవల పిడుగు పడి మరణించగా, మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

అనంతరం పిడుగు పడి గాయపడిన గుమ్మలపల్లి గ్రామానికి చెందిన వారిని కలిసి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునూరీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చీమల సందీప్, అధికార ప్రతినిధి కుంభం రమేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఓం సింగ్, అయిత శకుంతల, కుసుమ సమ్మయ్య, చీర్ల తిరుపతిరెడ్డి, వెంకటరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.