21-05-2025 04:53:22 PM
నిర్మల్ (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలో కుంటాల వెంకుర్ అంబకంటి గ్రామాలకు చెందిన రైతులు తాము ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపులు ఆలస్యం చేస్తున్నారని నిబంధనలు పాటించడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అక్కడే ఉన్న అధికారులను పిలిపించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కోమల్ రెడ్డి అధికారులు ఉన్నారు.