21-05-2025 08:54:56 PM
జిల్లా కలెక్టర్ కు లేఖ..
మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండి యాకూబ్ పాషా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కొరకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం(Rajiv Yuva Vikasam Scheme) అమలులో దళారులను కట్టడి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా(Minority Welfare Association President MD. Yakub Pasha) బుధవారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ ను కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువత కొరకు ప్రవేశపెట్టిన కార్పోరేషన్ రుణాల కోసం, లబ్దిదారులు దరఖాస్తు చేసుకున్నప్పుడు కొంతమంది దళారులు నేరుగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వద్దకు వెళ్ళి రుణాలు విడుదల కాకముందే దరఖాస్తు చేసుకున్న యూనిట్ విలువలో 30 నుండి 40 శాతం కమిషన్ ఇచ్చేలా ముందస్తుగా ఒప్పందం చేసుకున్న తర్వాతే లబ్ధిదారుల ఎంపిక చేశారన్నారు.
ఈ విషయంపై గత ప్రభుత్వ హయాంలో అధికారులకు ఫిర్యాదులు అందించినా చూసి చూడనట్లు వ్యవహరించారన్నారు. తాజాగా రాజీవ్ యువ వికాస పథకం కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వద్దకు దళారులు వెళ్ళి తమకు కమిషన్ అందిస్తేనే పక్కగా లోన్ వచ్చేలా చేస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తక్షణమే రాజీవ్ యువ వికాస పథకం కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నగదు నేరుగా వారి ఖాతాలోకి బదిలీ అయ్యేలా చేసి, దళారుల ఆట కట్టించాలని చెప్పారు. లేనిపక్షంలో ప్రభుత్వం లక్ష్యాన్ని అందుకోలేదని నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగేలా ఉందని ముందస్తుగా జిల్లా కలెక్టర్ కు లేక రాయనున్నట్లు తెలిపారు. యూనిట్ల మంజూరులో మరియు లబ్ధిదారుల ఎంపిక లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులకు తగిన విధంగా ఆదేశాలు జారీ చేయాలని లేఖలో తెలిపానన్నారు.