21-05-2025 09:04:04 PM
హనుమకొండ (విజయక్రాంతి): ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందిన తోట జగన్నాథంకి సంబంధించినటువంటి రెండు ఆవులు పిడుగుపాటుకు మృతి చెందడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్(Corporator Bairaboina Uma Damodar Yadav) రైతును పరామర్శించి కలెక్టర్, ఎమ్మార్వో ల దృష్టికి తీసుకెళ్లి స్థానిక వెటర్నరీ డాక్టర్ ను పిలిపించి పోస్టుమార్టం చేయడం జరిగింది. బొల్లం కార్తీక్, శానిటేషన్ సూపర్ వైజర్ భాస్కర్, వెటర్నరీ డాక్టర్ పున్నం, స్థానిక రైతులు, తదితరులు పరామర్శించారు.