calender_icon.png 22 May, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింగిళి ప్రభుత్వ కళాశాల పీజీ ఫలితాల విడుదల

21-05-2025 09:45:36 PM

కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి..

హనుమకొండ (విజయక్రాంతి): పింగిళి ప్రభుత్వ కళాశాల అటానమస్ మొదటి, మూడవ సెమిస్టర్ పీజీ ఫలితాలను ఈరోజు కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి విడుదల చేశారు. ఏప్రిల్ 2025లో జరిగిన పీజీ మొదటి, మూడవ సెమిస్టర్ లో సబ్జెక్టు వారిగా ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఫలితాలను చూసుకోవడానికి కళాశాల వెబ్సైట్ గాని, కళాశాలలోని ఎగ్జామినేషన్ బ్రాంచ్ ని కానీ, సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఫలితాల వివరాలు ఎంఏ ఇంగ్లీషు మొదటి సెమిస్టర్ లో 83.33%, మూడవ సెమిస్టర్ లో 100%, హిస్టరీ మొదటి సెమిస్టర్ లో 90%, మూడవ సెమిస్టర్ లో 100%, ఎంఏ తెలుగు మొదటి సెమిస్టర్లో 73 %, మూడవ సెమిస్టర్ లో 83%, ఎంఎస్సీ బాటనీలో 100%, ఎంఎస్సీ మైక్రో బయాలజీ ప్రథమ సెమిస్టర్లో 78%, మూడవ సెమిస్టర్ లో 94%, ఎంఎస్సి జువాలజీలో 89%, మూడవ సెమిస్టర్ లో 91%, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లో 57%, ఏం ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మొదటి సెమిస్టర్ లో 100%, ఏం కామ్ లో ప్రథమ సెమిస్టర్ 88%, మూడవ సెమిస్టర్ 80% ఓవరాల్ గా ప్రథమ సెమిస్టర్ లో 85%, మూడవ సెమిస్టర్లు 93% పాస్ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ సుహాసిని, అడిషనల్ కంట్రోలర్లు డాక్టర్ కొలిపాక శ్రీనివాస్, డాక్టర్ పి. రాజిరెడ్డి, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్ బాబు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.