21-05-2025 08:36:25 PM
టీబి అలార్ట్ ఇండియా ప్రోగ్రామ్ జిల్లా ఆఫీసర్ శ్రీనివాస్..
సిద్దిపేట (విజయక్రాంతి): టీబీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని టీబీ అలార్ట్ ఇండియా ప్రోగ్రామ్ జిల్లా ఆఫీసర్ శ్రీనివాస్(TB Alert India Program District Officer Srinivas) అన్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని నారాయణరావుపేట, రాఘవపూర్, లక్ష్మీదేవిపల్లి, రావు రూకుల, చింతమడక గ్రామాల్లోని టీబీ చాంపియన్స్ తో కలిసి మాట్లాడారు. క్షయ నివారణకు అన్ని రకాల మందులు లభిస్తున్నాయని వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించినట్లయితే వెంటనే నయం చేయవచ్చు అని గుర్తు చేశారు. రెండు వారాలకు మించి దగ్గు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ తెమడ పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలు చేయించుకోవాలన్నారు.
వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించినట్లయితే వెంటనే నివారించవచ్చున్నారు. క్షయ ఛాంపియన్లను అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. టీబీ వ్యాధిగ్రస్తుల పట్ల ప్రేమ ఆత్మాభిమానంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ మందులు ఉచితంగా లభిస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకొనెల చూడాలన్నారు. టీబీ సర్వైర్స్ తో మాట్లాడి వారి అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి ఆశ వర్కర్లకు పలు క్షయ వ్యాధిపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల వైద్య సిబ్బంది డాక్టర్ బాపురెడ్డి, సూపర్ వైజర్ సునీత, ప్రియదర్శిని, అజయ్, వైద్య సిబ్బంది పద్మావతి, భూంపల్లీ రాజు, సుధ, చంద్ర కళ, కరుణావతి, సుజాత, జ్యోతి. పద్మ, భారతి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.