calender_icon.png 1 December, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయిస్తే చర్యలు

01-12-2025 05:22:03 PM

తానూర్ (విజయక్రాంతి): మండలంలోని ఆయా గ్రామాల్లో బెల్టు షాపుల్లో మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై నవనీత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎన్నికల కోడ్ లో భాగంగా ఆయా గ్రామాలను తనిఖీ చేసి బెల్టు షాపుల్లో మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.