01-12-2025 06:02:21 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త అల్లెంకి సురేష్ సప్న ఆదర్శ దంపతులు భగవద్గీత ఆన్లైన్ క్లాసులో భాగంగా మైసూర్ లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ హస్తములచే బంగారు పతకం, సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం సురేష్ స్వప్న దంపతులకు సుల్తానాబాద్ ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.