01-12-2025 05:12:58 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): రక్త హీనత వ్యాధితో ఉన్నవారిని గుర్తించి, వారికి వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. అదిలాబాద్ రూరల్ మండలంలోని లోహర ప్రాథమిక పాఠశాల ఆవరణలో లోహర, జాముగూడ, ఎస్సి కాలనీ గ్రామాల ప్రజలకు రక్త హీనతపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా వైద్యాధికారిని డా. సాధన, డా. సర్ఫరాజ్ లతో కలిసి రక్తహీనతను తగ్గించే పౌష్టికాహారంకు స్పందించిన పోస్టర్లను విడుదల చేశారు.
అదేవిధంగా వైద్య సిబ్బంది గ్రామంలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త హీనతతో ఉన్నవారు వ్యాధి నివారణ ఏమిఏమి ఆహారం తినాలి, ఏ మందులు వాడాలి, చిన్న పిల్లలకు, గర్భిణీలకు, స్కూల్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజార్ లక్ష్మిబాయి, ఆరోగ్య పర్యవేక్షకులు బొమ్మెత సుభాష్, మర్సకొల లక్ష్మి బాయి, ఆరోగ్య కార్యకర్తలు చంద్రకళ భరత్, పవర్ ప్రేమసింగ్, ల్యాబ్ టెక్నీషియన్ సుష్మా, వీణా, అరుణ్, టీచర్స్ ప్రతాప్ సింగ్, శారదా, ఆశా దమ్మాశీల, అంగన్వాడీ టీచర్స్ అన్నపూర్ణ, సీత్తు బాయి గ్రామప్రజలు పాల్గొన్నారు.