calender_icon.png 1 December, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి ఎస్జిఎఫ్ టేబుల్ టెన్నిస్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు

01-12-2025 05:19:24 PM

విద్యార్థులను అభినందించిన పాఠశాల చైర్మన్ సంజీవ్ కుమార్.. ప్రిన్సిపాల్ కృష్ణ ప్రియ..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర స్థాయి ఎస్జిఎఫ్ టేబుల్ టెన్నిస్ పోటీలకు ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి 17 సంవత్సరాల బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీలలో సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు సి హెచ్ ఖుషి, ఎండి అష్రఫ్, బి మణికంఠ, జి సుశాంత్ లు జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి ఈనెల 1 నుండి 3 వ తేదీ వరకు ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

వీరి ఎంపిక పట్ల పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడల వల్ల విద్యార్థులు బంగారు భవిష్యత్తును నిర్మించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, శివ, సతీష్, మమత విద్యార్థులు పాల్గొన్నారు.