18-07-2025 01:30:00 AM
బంగారం అక్రమ రవాణా కేసు
బెంగళూరు, జూలై 17: అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావుకు ఏడాది జైలు శిక్ష పడింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివా రణ బోర్డు ఈ ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈ కేసులో రన్యారావుతో పాటు మరో ఇద్దరు నిందితులైన కొండారు రాజు, సాహిల్‌లకు ఇదే శిక్ష విధించినట్టు బోర్డు తెలిపింది. కేసులో ప్రతి మూడు నెలలకోసారి విచారణలు జరుగుతాయని పేర్కొంది.
దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ మార్చి తొలి వారంలో రన్యా రావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమె నుంచి 14.3 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. విచారణ సమయంలో రన్యారావు నివాసంలో ఈడీ అధికారులు 34 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు.