17-07-2025 11:59:58 PM
నిమిషా సాజయాన్ హీరోహీరోయిన్లుగా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో నటించిన తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘డీఎన్‌ఏ’. ఈ సినిమాను ‘మై బేబి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యష్‌ఫిలిం ఫ్యాక్టరీ, ఎస్‌కే పిక్చర్స్ బ్యానర్లపై విడుదల కానున్న ఈ సినిమాకు సురేశ్ కొండేటి నిర్మాత కాగా, దుప్పాడిగట్టు సారికరెడ్డి, పీ సాయిచరణ్‌తేజ కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 18న రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. “సురేశ్ కొండేటి ఎన్నో మంచి చిత్రాలను మనకు అందించాడు. ‘మై బేబి’ ట్రైలర్ చూస్తే స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలని కోరుకుంటున్నా” అన్నారు. సురేశ్ కొండేటి మాట్లాడుతూ.. “ఈ సినిమా ప్రీమియర్ షో చూసి మురళీమోహన్ లాంటి సీనియర్ నటులు కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో అర్థమైంది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి క్రేజీగా బిజినెస్ జరిగింది.
నేను ప్రొడ్యూస్ చేసిన చిత్రాల్లో అన్నింటికన్నా ఎక్కువ థియేటర్లలో ‘మై బేబి’ రిలీజ్ కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 350 స్క్రీన్లలో ఈ సినిమా విడుదలకు వస్తోంది. నైజాంలో 130కి పైగా స్క్రీన్స్ పడుతున్నాయి. ఇన్ని థియేటర్లలో నా సినిమా రావడం హ్యాపీగా ఉంది. మంచి మదర్ సెంటిమెంట్, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది” అని చెప్పారు. “సురేశ్ కొండేటి జడ్జిమెంట్‌ను నమ్ముతున్నాం. మా సంస్థకు ఇది తొలి సినిమా.. పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం” అని సహ నిర్మాత సాయిచరణ్‌తేజ అన్నారు.