25-09-2025 12:00:00 AM
హనుమకొండలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ నెల 27న నిర్వహణ
హెదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): హనుమకొండలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో సైకిల్, స్కూటర్, కార్ పార్కిం గ్ స్టాండ్ నిర్వహణ కోసం ఈ నెల 27న సా యంత్రం 4 గంటలకు హనుమకొండలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాంగణంలో వేలం నిర్వహించబడుతుందని హనుమకొండ జిల్లా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అజీమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
వేలంలో పాల్గొనాలనుకునే వ్యక్తులు తప్పనిసరిగా వెయ్యి రూపా యల మొత్తాన్ని సూపరింటెండెంట్ (అకౌం ట్స్), ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, హనుమకొండ వద్ద 27న సాయంత్రం 3 గంటలలోపు డిపాజిట్ చేసి అర్హత పొంది ఉండాలి. పూర్తి వివరాల కోసం హనుమకొండ డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్‌సైట్ చూడవచ్చని వారు తెలిపారు.