12-08-2024 01:42:58 AM
విశ్లేషకుల అంచనాలివి..
న్యూఢిల్లీ, ఆగస్టు 11: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో గత వారం భారత్ స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలతో ముగిసాయి. ఈ సోమవారం మార్కెట్ ప్రారంభా న్ని మాత్రం హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నిర్దేశించనుంది. అదానీ గ్రూప్‌తో సెబీ చీఫ్ మాధబి పురి బుచ్‌కు ఉన్న ఆర్థిక సంబంధాలపై హిండెన్‌బర్గ్ చేసిన తాజా ఆరోపణల ప్రభావంతో పెద్ద ఇన్వెస్టర్లు వారి పొజిషన్లను కాస్త తగ్గించుకునే అవకాశం ఉన్నందున సోమవా రం ఉదయం మార్కెట్ తొలుత క్షీణతను చవిచూడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ హిండెన్‌బర్గ్ చీఫ్ అంశం ఎటువంటి మలుపు తీసుకుంటుందోనన్న భావనతో పెద్ద ఇన్వెస్టర్లు కాస్త వెను కడుగు వేస్తారని, అయితే ఇందువల్ల పెద్ద పతనమేమి ఉండబోదని ఇండిపెండెంట్ మార్కెట్ నిపుణుడు అంబరీష్ బలీగా చెప్పారు.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ప్రభావం అదానీ స్టాక్స్‌పై కొంత ఉండవచ్చని, గత ఏడాది జనవరిలో తొలి నివేదిక విడుదలైన సందర్భం గా సంభవించిన భారీ పతనం ఈ దఫా ఉండబోదని అంచనా వేశారు. మొత్తంమీద సోమవారం ఉదయం మార్కెట్‌పై హిండెన్‌బర్గ్ ప్రభావం పెద్దగా ఉండబోదని, ఇది మిన్నువిరిగి మీద పడటం కాదని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ డైరెక్టర్ క్రాంతి బత్తిని చెప్పారు. షేర్ల ధరలు కంపెనీల ఆదాయ లాభాలపై ఆధారపడి ఉంటాయని, అదానీ గ్రూప్ షేర్లపై కూడా రిపోర్ట్ ప్రభావం ఉండబోదని అంచనా వేశారు. ఆ కంపెనీల లాభాలు దెబ్బతినే అవకాశం ఉంటే మార్కెట్ స్పందిస్తుందన్నారు.
వాస్తవాలు బయటకు వచ్చేం తవరకూ ఈ రిపోర్ట్‌పై ఎక్కువగా స్పందించవద్దని ఇన్వెస్టర్లకు పీఎంఎస్ ఫండ్ మేనేజర్ గుర్మీత్ చద్దా సూచించారు. ప్రపంచంలోకెల్లా ఆర్బీఐ, సెబీలు ఉత్తమమైన రెగ్యులే టర్లని, అటువంటి రిపోర్ట్‌లు ఇండియా ఆర్థిక వ్యవస్థపై సందేహాలు సృష్టించడానికి మన కంపెనీలు, రెగ్యులేటర్లపై జరుపుతున్న దాడి గా వివరించారు. హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో పసలేదని, కేవలం సంచలనం సృష్టించడానికే రిపోర్ట్ విడుదల చేశారని మరో ఫండ్ మేనేజర్ దీపక్ షెనాయ్ చెప్పారు.
హిండెన్‌బర్గ్ డిస్‌క్లుమైర్ చదవండి... కామ్‌గా ఉండండి
ఇన్వెస్టర్లకు సెబీ సూచన
ఇన్వెస్టర్లు అనవసర ఆందోళనకు లోనుకావొద్దని, ప్రశాంతంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సెబీ సూచించింది. అటువం టి రిపోర్టులకు స్పందించే ముందు హిం డెన్‌బర్గ్ డిస్‌క్లుమైర్‌ను పూర్తిగా చదవాలని, ఆ రిపోర్ట్‌లో ప్రస్తావించిన కంపెనీల సెక్యూరిటీల్లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు షార్ట్ పొజిషన్లు ఉండవచ్చని పేర్కొంది.