20-08-2025 06:24:52 PM
అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజి వకాడే
హుజురాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదుల పనులను త్వరగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే బుధవారం అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నమైన రిపేర్ వర్కులకు చెందిన పనులను పరిశీలించారు. విద్యార్థుల సమావేశా మందిర పనులు, గ్రిల్స్, మెట్లు, ఫ్యాన్లు, కరెంటునకు సంబంధించిన వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయరావుని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు మీటింగ్ హాలు లేనందున ఇబ్బందులు ఎదుర్కొంటారని వెంటనే నిర్మాణం పూర్తి చేయాలన్నారు. కళాశాల విద్యార్థులకు స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఐడికార్డ్స్ ను ఆమె ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థిని విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చి ఉత్తీర్ణత సాధించి కళాశాలకు పేరు తేవాలన్నారు. కళాశాల ఉత్తీర్ణశాతం పెంచాలని ప్రిన్సిపాల్ ఆంజనేయులుకి సూచించారు. అనంతరం కళాశాల ఆవరణలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో సుమారు 250 మొక్కలు నాటి హరితహారం నిర్వహించారు. అడిషన్ కలెక్టర్ ని మున్సిపల్ కమిషన్ ని కళాశాల ప్రిన్సిపల్ అంజయ్య సన్మానించారు.