20-08-2025 06:20:25 PM
తిమ్మాపూర్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో శ్రీ చైతన్య విద్యా సంస్థ ను ఏర్పాటు చేశామని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ విద్యాసంస్థలు మొదటి సంవత్సరం బిటెక్ లో చేరిన విద్యార్థులకు బుధవారం ఓరియంటేషన్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మాట్లాడారు.
తమ కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో పాటు లైబ్రరీలో తగు పుస్తకాలను ఏర్పాటు చేశామని విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమపై కట్టుకున్న ఆశలను నెరవేరుస్తూ తమ కళాశాలలో ఎలాంటి చెడు వ్యసనాలతో సెల్ ఫోన్ కు అలవాటు పడకుండా విద్య పైన ప్రత్యేక దృష్టిని సారించి తమ కళాశాలలో నిర్వహించే క్యాంపస్ ప్లేస్మెంట్లలో జాబును సాధించి తమ తల్లిదండ్రులకు కళాశాలకు పేరు ప్రతిష్టలను తీసుకురావాలని ఆకాంక్షించారు.