12-07-2025 04:41:22 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మహిళా పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత జన్మదిన వేడుకలు ప్రణవ్ బాబు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామంలో ప్రణవ్ బాబు స్వగృహంలో శనివారం కేక్ కట్ చేపించి పుష్పలతను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు ప్రణవ్ తెలిపారు. అనంతరం పుష్పలతకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.