calender_icon.png 13 July, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రతి నెల రూ. 700 కోట్ల నిధులు విడుదల చెయ్యాలి

12-07-2025 04:33:30 PM

టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ డిమాండ్..

కామారెడ్డి (విజయక్రాంతి): పెండింగ్ బిల్లుల చెల్లింపులకు కేబినెట్లో తీర్మానించిన విధంగా ప్రతినెల 700 కోట్లు నిధులు విడుదల చేయాలని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. PSHM పోస్టులు ప్రాథమిక పాఠశాలలకు కేటాయించి బీఈడీ, టిటిసి అర్హతల గల ఇద్దరికీ పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర(Telangana Progressive Teachers Federation State) అధ్యక్షులు చకినాలా అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. టి.పి.టి.ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల లింగం అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించడానికి ఉపాధ్యాయులనే నియమించడం మానుకొని, పర్యవేక్షణ పోస్టులు మంజూరు చేయాలన్నారు.

పర్యవేక్షణ అధికారుల నియామకం చేయాలని డిమాండ్ చేశారు. విద్యను విధ్వంసం చేసే విధానాలను మానుకొని, అందరికీ సమాన విద్యను ప్రభుత్వమే అందించాలని అన్నారు. రెండు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న అన్ని రకాల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందించకుండా, ఉద్యోగుల నుండి అమౌంట్ సేకరించడం ఇదోరకమైన మోసం అని అన్నారు. జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటులో నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులను మారుమూల గ్రామాల నుండి జిల్లా హెడ్ క్వార్టర్ కు బదిలీ చేయడం నిబంధనలకు విరుద్ధం కావున వాటిని వెంటనే విరమించుకోవాలి, ఉద్యోగులు పొదుపుచేసుకున్న జిపీఫ్, టీజిఎలైసి మొత్తాల నుండి ఇవ్వాళ లోనులు పార్టీ ఫైనల్స్ పొందలేని పరిస్థితులున్నాయని అన్నారు.

వెంటనే ప్రభుత్వం PRCని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. KGBV ఉపాధ్యాయుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని, వారిని తక్షణమే రి ఆర్గనైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాజంలో ఉపాధ్యాయులు సింహ భాగంగా పనిచేయాలి, అంతరాలు లేని సమాజం కోసం ఫెడరేషన్ కార్యకర్తలు విధులు నిర్వహించాలి.  అందరికీ సమాన విద్యను అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తేనే అన్ని స్కూల్లు బాగుపడుతాయని అన్నారు. ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరిస్తే, ఉపాధ్యాయులు ఉద్యమాల్లో ఉంటారని అన్నారు. విద్యారంగా సమస్యలు పరిష్కరించాలంటే ఉద్యమం ఒక్కటే మార్గమని పిలుపునిచ్చారు. ఒక వర్గానికి అనుగుణంగా ఉండే విధంగా తయారుచేస్తున్న విద్యా ప్రణాళికలను నిలిపివేసి, అన్ని జాతుల అభివృద్ధి కోసమా ఉపయోగపడే విద్యను ప్రభుత్వాలు అందించాలని అన్నారు. 

ప్రయివేట్ స్కూల్లలో ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా, ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులతో పర్యవేక్షణ చేయించడం సరైన విధానం కాదని అన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతల లింగం ,చింతల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 10 వేల ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేసి, యస్ జీ టీలకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండేండ్లులుగా పెండింగులో ఉన్న వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో విధులు నిర్వహించిన వారికి సర్వే అమౌంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని , 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమించబడ్డ DSC 2003 ఉపాధ్యాయులకు మెమో 57 ను అమలు చేసి OPS పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు.కేజిబీవి సిబ్బందికి చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

నైట్ డ్యూటీ చేసిన సిబ్బందిని ఉదయం 7 గంటలకు రిలీవ్ చెయ్యాలని అన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని, సమ్మేకలపు వేతనం వెంటనే విడుదల చెయ్యాలని అన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ శాస్త్రియంగా చేపట్టి, అవసరమున్న పాఠశాలలకు మాత్రమే ఉపాధ్యాయులను కేటాయించాలని  డిమాండ్ చేశారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉన్న టైమ్ టేబుల్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చింతల లింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ , జిల్లా కార్యదర్శులు ప్రకాష్, సోలేటి నారాయణ, కె.నరేందర్, కృష్ణ, కృష్ణమూర్తి, రాజశేఖర్ కృష్ణ, శ్రీధర్ రెడ్డి, మద్నూర్ మండల అధ్యక్షులు బి. బాబయ్య, మాచారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ లు పాల్గొన్నారు.