calender_icon.png 13 July, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన డీఎంహెచ్ఓ

12-07-2025 04:44:44 PM

మణుగూరు (విజయక్రాంతి): జిల్లా వైద్యారోగ్య అధికారిగా(డీఎంహెచ్ఓ) బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జయలక్ష్మి శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించారు. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజల ఆరోగ్యం పట్ల వైద్య ఆరోగ్యశాఖ, సిబ్బంది శ్రద్ధ వహించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జయలక్ష్మికి సూచించారు. వాతావరణ మార్పులు కారణంగా ప్రజల్లో విష జ్వరాలు సంక్రమిస్తున్నాయని, ఎప్పటికప్పుడు వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించి అవసరమైతే వైద్య శిభిరాలు నిర్వహించి చికిత్స అందించాలన్నారు. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్య క్రమంలో జిల్లా డిప్యూటీ డీఎం హెచ్ఓ డాక్టర్. చైతన్య పాల్గొన్నారు.