calender_icon.png 13 July, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం

12-07-2025 04:36:20 PM

బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సాప శివ రాములు..

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు...

కామారెడ్డి (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ, విద్యార్థి సంఘం అధ్యక్షులు సాప శివ రాములు, నీల నాగరాజు అన్నారు. శనివారం ఆర్&బి గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, కామరెడ్డి బీసీ డిక్లరేషన్(BC Declaration)లో హామీ ఇచ్చిన విధంగా రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులకు, బీసీ ప్రభుత్వ సలహాదారులకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ బిల్లు ఆమోదించాలని మూడు నెలలు ఎదురుచూసిన కేంద్రం బీసీలకు నిరాశే మిగిల్చింది. తప్పని పరిస్థితిలోనే చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు.

బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష పార్టీలు రాజకీయం చేయొద్దని, బీసీ రిజర్వేషన్లను ఎవరు అడ్డుకోవాలని చూసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. అగ్రకులాలు బీసీ రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలని లేదంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రద్దు కోసం రోడ్డెక్కాల్సి వస్తుందన్నారు.న్యాయస్థానాలను అడ్డుపెట్టుకొని బీసీల అవకాశాలను కాలరాస్తే, వారి మూలాలను పెకిలించి బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కొన్ని పార్టీల వైఖరి అమ్మ పెట్టదు- అడుక్కొని ఇవ్వదన్న చందంగా వ్యవహరిస్తున్నాయి.క్యాబినెట్ తీర్మానం ముమ్మాటికి ఇది బీసీల పోరాట విజయమే అని అన్నారు.

2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం అని,స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచాలని గత 18 నెలలుగా అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని గల్లీ నుండి ఢిల్లీ వరకు నిర్వహించిన పోరాట ఫలితమే ఈ 42 శాతం రిజర్వేషన్ల ప్రకటన,ఇది ముమ్మాటికి బీసీల విజయంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి ఉప్పునూతల నాగరాజ్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు మారోజు మోహణా చారి, నాగోజి నారాయణ రావ్, అబ్దుల్ అజీజ్, అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న తదితరులు పాల్గొన్నారు.