13-01-2026 01:32:19 AM
కాలిఫోర్నియా బెవర్లి హిల్స్ వేదికగా 83వ ‘గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులు వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ‘అడాల్‌సెన్స్’ కీలక విభాగాల్లో అవార్డులు దక్కాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్న ఈ సిరీస్.. తాజాగా ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్స్ 2026 అవార్డుల్లో గౌరవం దక్కటంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా నటన విభాగాల్లో రెండు ప్రధాన అవార్డులు సొంతం చేసుకోవడంతో ఈ షో స్థాయిని మరో మెట్టు ఎక్కించింది.
ఈ సిరీస్‌లో తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓవెన్ కూపర్ అత్యంత చిన్న వయసులోనే ఉత్తమ సహాయ నటుడు (టీవీ సిరీస్)గా గోల్డెన్ గ్లోబ్ అందుకుని అరుదైన రికార్డు సృష్టించాడు. ఉత్తమ నటుడు (టీవీ సిరీస్) విభాగంలో స్టీఫెన్ గ్రాహంకు అవార్డు లభించింది. ప్రముఖ స్టాండ్-అప్ కామెడియన్ నిక్కీ గ్లేజర్‌తోపాటు గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం ఈసారి వేడుకలకు మరింత అందం తెచ్చిపెట్టింది. 2025లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటీనటుల ప్రతిభకు ఈ వేడుకలో అవార్డులు ప్రదానం చేశారు.