calender_icon.png 13 January, 2026 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ప్రశ్న విని ప్రేక్షకులు కచ్చితంగా షాక్ అవుతారు

13-01-2026 01:34:48 AM

రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలు. నేడు విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలు డైరెక్టర్ కిషోర్ మాటల్లో.. 

 -ఒక భర్త తన అనుభవం వల్ల మిగతా భర్తలకు ఏం చెప్తున్నాడు.. తను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనేది ఈ కథలోని ప్రధాన అంశం. -ఈ కథను ఇల్లాలు, ప్రియురాలు కోణంలో కాకుండా చాలా విభిన్నంగా రూపొందించాం. -ఇందులో ఇద్దరమ్మాయిలు అడిగిన ప్రశ్న పెళ్లయిన వాళ్లందరూ ఎప్పుడో ఒక సమయంలో ఎదుర్కొన్నదే. అలాంటి ప్రశ్న అడిగినప్పుడు వెంటనే ఏం సమాధానం చెప్పాలో తెలీదు. ఆ ప్రశ్న నిజంగా చాలా కఠినమైనది. దానికి సమాధానం సినిమాలో దొరుకుతుంది. 

 ఇద్దరమ్మాయిలు అడిగే ఆ ప్రశ్న చాలా సున్నితంగా ఉంటుంది. నిజానికి అలాంటి సమస్య వచ్చినప్పుడు గొడవలు పెట్టుకుంటారు. మనస్పర్ధలు పెంచుకుంటారు. విడాకులు కూడా తీసుకుంటారు. కచ్చితంగా ఆ ప్రశ్న విని ప్రేక్షకులు షాక్ అవుతారు. ప్రశ్నలోనే అన్నిటికంటే పెద్ద పనిష్మెంట్ ఉంటుంది.  

 రవితేజతో చేద్దామని అనుకున్న తర్వాతే రాసుకున్న కథ ఇది. ఆయన దగ్గర చాలా ప్రాజెక్టులున్నాయి. అయినా ఈ స్క్రిప్టు చక్కగా ఉందని ముందు ఈ సినిమానే చేద్దామని ముందుకొచ్చారు. నాకోసం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు.. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నేను అదే చేస్తానని చెప్పారు. ఈ సినిమా విషయంలో ఆయన ఇచ్చిన కొన్ని ఇన్‌పుట్స్ కూడా తీసుకున్నా. ‘-రంగబలి’ డైరెక్టర్ పవన్ ఈ సినిమా స్క్రిప్ట్‌కి పనిచేశారు. ఈ టైటిల్ ఆలోచన ఆయనదే. ఈ సినిమాలో సత్య నటించిన ఒక పాటకు కొరియోగ్రఫీ కూడా చేశా. అదొక చిన్న బిట్ సాంగ్.. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. 

 -ఆషికా, డింపుల్.. ఇద్దరి క్యారెక్టర్స్ విభిన్నంగా ఉంటాయి. ఆషికా పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. డింపుల్ కూడా ఇప్పటివరకు కనిపించని ఒక డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారు. సత్య, వెన్నెల కిషోర్ ట్రాక్స్ హిలేరియస్‌గా ఉంటాయి. సునీల్‌ది కూడా హిలేరియస్ క్యారెక్టర్. ‘పెళ్ళాం ఊరెళితే’.. ‘దుబాయ్ శీను’ లాంటి ఫన్ ఉంటుంది. చాలా అద్భుతమైన తారాగణంతో సంక్రాంతికి వస్తే ఖచ్చితంగా ఆ వైబ్ పెరుగుతుంది. మేమంతా హ్యాపీగా ఉన్నాం.  

 ‘మిరాయ్’ -డైరెక్టర్ కార్తీక్ నాకు చాలా క్లోజ్. ఆ సినిమాలో నేను నటించిన తర్వాత ఒక యాక్టర్ లైఫ్ ఎలా ఉంటుందనేది అనుభవమైంది. నచ్చిన క్యారెక్టర్, ఇష్టమైన డైరెక్టర్ అయితే నటనని కొనసాగించవచ్చు. ఆ సినిమా పార్ట్2లో కూడా నేను ఉండే అవకాశం ఉంది. 

 కొత్తగా -రెండు మూడు కథలున్నాయి. డివోషనల్ మైథాలజీలో ఒక స్క్రిప్టు, ‘మున్నా భాయ్’ లాంటి సోషల్ సెటైర్ కథ మరొకటి ఉంది. ఏది ముందుగా చేస్తాననేది త్వరలోనే తెలియజేస్తా.