calender_icon.png 13 January, 2026 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ కండీషన్‌పై టికెట్ ధరలు పెంచుతామని చెప్పాం

13-01-2026 01:30:43 AM

సినిమా టికెట్ ధరలు, బెనిఫిట్ షోలకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని, టికెట్ ధరల పెంపు జీవోల విషయం తనకు తెలియదని ఇటీవల సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న సంగతి తెలిసిందే. సోమవారం సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై మంత్రి మరోసారి స్పందించారు. టికెట్ ధరల పెంపు విషయంలో అంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. “సంధ్య థియేటర్ ఘటన తర్వాత టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని నేను, ముఖ్యమంత్రి ప్రకటించిన మాట వాస్తవమే.

ఆ తర్వాత మేమంతా కూర్చొని మాట్లాడుకుని మా నిర్ణయాన్ని సవరించాం. ఒకవేళ టికెట్ ధరలు పెంచాల్సి వస్తే 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని షరతు పెట్టాం. అందుకు అనుగుణంగానే కొన్ని సినిమాలకు ఇచ్చాం. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సమయంలో నేను హైదరాబాద్‌లో లేను. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా నల్గొండ, భువనగిరి జిల్లాలను పర్యవేక్షిస్తున్నా. అప్పుడే జీవో ఇచ్చారు. మా సీఎం ఏ శాఖల విషయంలోనూ జోక్యం చేసుకోరు. అందరినీ కలుపుకొని వెళ్తారు” అని చెప్పారు.